ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి.

🔴 ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి.

నిజస్వరం బొంరాస్ పేట్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ మండల్ మేడి చెట్టు తండ గ్రామపంచాయతీలో బోడబండ తండా లో నూతన ఇందిరమ్మ ఇండ్లను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం ఎంతో సంతోషకరమని అలాగే కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారు త్వరగా పూర్తి చేసుకోవాలని ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే నా వరకు వస్తే నేను సీఎం రేవంత్ రెడ్డికి తెలుపుతానని రాజేష్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మోహన్ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాకు సొంత ఇల్లు లేక చాలా ఇబ్బందిగా ఉండేవాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి నా సొంత ఇంటి కలను నిజం చేశారని సంతోషం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తు జీవితమంతా ఆయనకు రుణపడి ఉంటానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింలు గౌడ్ PACS చైర్మన్ జయ కృష్ణ

మేడి చెట్టు తండా గ్రామపంచాయతీ సర్పంచ్ రవి నాయక్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.