🔴 మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే..
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేడు వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు.
తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు.
అనంతరం తాండూరు మండల కార్యాలయంలో ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమానికి తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
