టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి,

 🔴 టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి,

నిజస్వరం పెద్దముల్ ప్రతినిధి ::

పెద్దెముల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ది మాస్టర్ మైండ్ స్కూల్ సౌజన్యంతో

తాండూరు మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్ ఉప్పరి స్వరూప మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దెములు ప్రీమియర్ లీగ్ పిపిఎల్ సీజన్ సిక్స్ క్రికెటర్ టోర్నమెంట్ విజేతలకు తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, యం.డి.రియాజ్ రాష్ట కన్వీనర్ టి.పి.సి.సి. మైనార్టీ డిపార్ట్మెంట్ స్థానిక నాయకులు, నీ మాస్టర్ మైండ్ స్కూల్ సిబ్బంది, డైరెక్టర్లు ఉప్పరి మల్లేశం,ఉప్పరి రవీందర్ , పెద్దెముల్ గ్రామ సర్పంచ్ డివై నర్సింహులు, ఉప సర్పంచ్ డివై ప్రసాద్, మండల తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్, ch. రాములు . ఫయాజ్ . బ్యాగిరి. మల్లేష్ . ఇక్బాల్ . లతో కలిసి విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.

టోర్నమెంట్ విజేతగా పెద్దేముల్ డేర్ డెవిల్స్ టీం గెలుపొందగా రూ.5000 రూపాయలు నగదు ట్రోఫీని, రన్నర్ గా నిలిచిన పెద్దేముల్ స్ట్రైకర్స్ జట్టుకు 3000 రూపాయల నగదు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్లు సి.పాండు, మహమ్మద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు.