అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికైన గాజిపూర్ గ్రామానికి చెందిన ఎర్రా హర్షవర్ధన్‌కు RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి భారీ ఆర్థిక చేయూత.
క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికైన గాజిపూర్ గ్రామానికి చెందిన ఎర్రా హర్షవర్ధన్‌కు RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి భారీ ఆర్థిక చేయూత.
గాజిపూర్ గ్రామం నుండి జాతీయ స్థాయి సెయిలింగ్ అథ్లెట్ ఎదిగిన ఎర్రా హర్షవర్ధన్ ను అభినందించి అండగా నిలిచిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి.
పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన జాతీయ సెయిలింగ్ క్రీడాకారుడు ఎర్రా హర్షవర్ధన్ ఈ నెల 24వ తేదీ నుండి మలేషియాలోని లంఖావిలో నిర్వహించనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికయ్యాడు,అయితే హర్షవర్ధన్ బెంగళూరులోని ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీకి 9వ తరగతిలొనే ఎంపికై అక్కడే ఉంటూ గత ఐదు సంవత్సరులుగా సెయిలింగ్ క్రీడలో కోచింగ్ తీసుకుంటూ జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించి ఇండియన్ సెయిలింగ్ అథ్లెట్ గా నిలిచాడు అయితే
అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి తండ్రి ఎర్రా చిన్న ఎల్లప్ప(యేసు) రైతు కావడంతో ఆర్ధిక భారంతో పోటీల్లో పాల్గొనేందుకు ఇబ్బంది పడుతున్న సంగతి గాజిపూర్ గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దల ద్వారా తెలుసుకున్న ఆర్‌బీఓఎల్ (RBOL) సంస్థ సీఈఓ ఎర్రా హర్షవర్ధన్‌లోని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన లక్షా యాభై వేల(1,50,000) రూపాయలు చెక్కు రూపంలో ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ హర్షవర్ధన్ మలేషియాలో జరిగే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి గాజీపూర్ గ్రామంతో పాటు తాండూర్ ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గాజీపూర్ సర్పంచ్ లాల్‌రెడ్డి,విద్యావేత్త పర్యాద రామకృష్ణ,గ్రామ పెద్దలు ప్రకాష్ రెడ్డి, నసీర్, నర్సిములు,లాలప్ప మరియు భద్రేశ్వర దేవస్థాన మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్,తాండూరు 19వ వార్డు కౌన్సిలర్ జుంటిపల్లి వెంకట్, కాంగ్రేస్ నాయకులు రాజు గౌడ్ ,సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
