చికెన్, వ్యర్ధాల టెండర్ ప్రక్రియ మరోసారి రద్దా?

చికెన్ వ్యర్ధాల టెండర్ ప్రక్రియ మరోసారి రద్దా?

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చికెన్, మటన్ వ్యర్ధాల టెండర్ ప్రక్రియ మరోసారి సందిగ్ధంలో పడింది. ఈ నెల 7న మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటలో రూ. 20 లక్షలకు దక్కించుకున్న టెండర్ ను మహమ్మద్ హమీద్ ఆ టెండర్ డబ్బులను చెల్లించకుండా చేతు లెత్తేయడంతో టెండర్ ప్రక్రియలో భాగంగా వేలం పాటలో పాల్గొన్న రెండవ వ్యక్తి రూ. 17 లక్షల 7 వేలకు పాట పాడిన అబ్దుల్ రహీంకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అవకాశం ఇవ్వడం జరిగిందని కమిషనర్ తెలిపారు.

రెండో వ్యక్తి కూడా స్పందించకపోతే వేలంపాటలో పాల్గొన్న మూడో వ్యక్తికి టెండర్లను కేటాయించాలి లేదా మరోసారి రీ టెండర్లను పిలవాలి. ఆరోజు టెండర్లలో పాల్గొన్న మూడో వ్యక్తి రూ. 6 లక్షల 50 వేలకు కోట్ చేస్తూ మొహమ్మద్ ఏజాజ్ వేలంలో పాల్గొన్నాడు. అయితే రి టెండర్ కు మున్సిపల్ అధికారులు మోగ్గు చూపుతారా లేదా మూడో వ్యక్తికి కేటాయిస్తారో వేచి చూడాల్సిందే..