🔴 బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రధాన రవాణా మార్గాలైన బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో పోలీసులు నేడు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. తాండూరు డిఎస్పి నర్సింగ్ యాదయ్య ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని బస్ స్టేషన్ మరియు రైల్వే స్టేషన్ లలో పాపులన్ డివైస్ ద్వారా అనుమానాస్పద బ్యాగులను తనిఖీలు చేయడం జరిగిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తాండూరు డిఎస్పి నర్సింగ్ యాదయ్య, తాండూర్ టౌన్ సిఐ పరమేశ్వర్, ఎస్సైలు అంబర్యా, నజీద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
