తాండూర్ నూతన ఆర్డీవో గా కర్ర అనిత.

🔴 తాండూర్ నూతన ఆర్డీవో గా కర్ర అనిత.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి  ::

వికారాబాద్ జిల్లా తాండూర్ నూతన ఆర్డీవో గా కర్ర అనిత నియామకం అయినట్టు ప్రభుత్వ ఆదేశాలు జారి అయ్యాయి. కర్ర అనిత ఇదివరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ లో ల్యాండ్ ప్రొటెక్షన్ సేల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పని చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి తాండూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ప్రభుత్వం ఆమెను నియమించింది.

అయితే ఇప్పటివరకు సబ్ కలెక్టర్గా పనిచేసిన ఉమా శంకర్ ప్రసాద్ అదనపు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.  కొడంగల్ పట్టణంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం కాగా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం స్థానంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం గా మార్చారు.

ఇప్పటివరకు సబ్ కలెక్టర్గా పని చేసిన ఉమాశంకర్ ప్రసాద్ స్థానంలో ఆర్డీవో గా కే అనితను నియమించినట్లు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం తాండూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సిబ్బంది ఆమెకు స్వాగతం తెలిపారు.