ఎమ్మెల్యేను మున్సిపల్ చైర్ పర్సన్ ను విమర్శించే స్థాయి మీకు లేదు.

 

ఎమ్మెల్యేను మున్సిపల్ చైర్ పర్సన్ ను విమర్శించే స్థాయి మీకు లేదు.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి::

తాండూర్ ఎమ్మెల్యే  బి మనో రెడ్డి ని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదని కాంగ్రెస్ పార్టీ 8 వ వార్డ్  ఇంచార్జ్ తలారి సాయప్ప,   ఐ ఎన్ టీ యూ సి   తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు న్యాయవాది జిల్లాని, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు హర్షియా ఖాన్,  కోఆప్షన్ సభ్యులు వాజిద్ మియా,  టౌన్ మైనార్టీ సెక్రెటరీ అమీనా బేగం,  కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొయిజ్ ఖురేషి,  షా్యైబ్,  మాట్లాడుతు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అన్నారు.  అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అని అన్నారు. తాండూర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనే పేదలకు ఇండ్లు పింఛన్ ఉపాధి వైద్యం విద్య అందిందని మళ్లీ పదేళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు వీటన్నిటికీ దూరం పెట్టిందని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు రేషన్ కార్డులు ఉపాధి వైద్యం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుందని అన్నారు.

తాండూర్ లో రాజీవ్ కాలనీ ఇందిరమ్మ కాలనీ మాణిక్ నగర్ ఇందిరానగర్ కాలనీలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు.

రాబోయే రెండు నెలల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్లను పూర్తి చేసి నిరుపేదలకు పంపిణీ చేస్తారని అన్నారు. ఇవే కాదు ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇల్లు దీనితోపాటు స్థలం లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చే పథకాన్ని త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుందని వారు అన్నారు.

తాండూరులో ఎమ్మెల్యే  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఏది చేసినా మా ఎమ్మెల్యే  చేయాలి నిధులు అభివృద్ధి కేవలం కాంగ్రెస్ చేతనే అవుతుందని కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పై ఎమ్మెల్యే పై ప్రజాప్రతినిపై విమర్శలు చేస్తే సహించేది లేదని అన్నారు.8 వ వార్డులో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 3 కోట్ల అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు.

వడ్డించే వారే మా ఎమ్మెల్యే ఉన్నారు. ఎవరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు భయపడకుండా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందు ఉండి సమస్యలు పరిష్కరించాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉర్దూగర్ డైరెక్టర్ నవాజ్ వేగం బాబాసాహెబ్ కమల యాసిన్ ఖాన్ శ్రీను సుమలత సంగారెడ్డి పాల్గొన్నారు.