🔴 మానవత్వానికి మరో రూపం డాక్టర్ సంపత్ కుమార్. 166వ సారి రక్తదానం.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూర్: బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేదలకు అండగా నిలుస్తూ ఆయన 166వ సారి రక్తదానం చేశారు.
బషీరాబాద్ మండలానికి చెందిన ఆక్తర్ భాను అనే మహిళకు అత్యవసరంగా ఓ నెగటివ్ రక్తం అవసరమైంది. విషయం తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ వెంటనే స్పందించి, అరక్షణం కూడా ఆలోచించకుండా తన రక్తాన్ని దానం చేశారు.
సొంతవాళ్లు కూడా రక్తం ఇవ్వడానికి వెనుకాడే ఈ రోజుల్లో, అడిగిన వెంటనే ముందుకు వచ్చి ప్రాణదాతగా నిలిచిన డాక్టర్ సంపత్ కుమార్‌పై తాండూర్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం తాండూర్ ప్రజలకే కాకుండా, చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలకు కూడా అత్యవసర సమయాల్లో తన రక్తాన్ని అందించి ఆదుకుంటున్నారని స్థానికులు కొనియాడుతున్నారు.
ఇంతటి మంచి మనసున్న మానవతావాది డాక్టర్ సంపత్ కుమార్‌కు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అభిమానులు, ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
