🔴 రాజకీయ నాయకుడు కాదు… రాజనీతిజ్ఞుడు.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూరు ప్రజలు గర్వించదగ్గ నాయకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
రాజకీయ నాయకులు సాధారణంగా వచ్చే ఐదు సంవత్సరాల ఎన్నికలు, ఓట్ల గురించి ఆలోచిస్తారు. కానీ రాజనీతిజ్ఞుడు మాత్రం భవిష్యత్ తరాల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు.
ఆ కోవకు చెందిన నాయకుడే మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
గత పాలకుల హయాంలో తాండూరు ప్రజల స్థలాలు, సహజ వనరులు ఎలా కబ్జాలకు, దోపిడీకి గురయ్యాయో ప్రజలందరికీ తెలిసిందే. అయితే మనోహర్ అన్న నాయకత్వంలో ప్రజా ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యత లభిస్తోంది.
తాండూరు పట్టణానికి మణిహారంగా విరాజిల్లుతున్న విలియం మూన్ పాఠశాల స్థలం పట్టణ ప్రజలకు ఎంతో విలువైన ఆస్తి. ఈ ప్రదేశం పర్యావరణ పరిరక్షణకు, ఉదయం వాకింగ్‌కు వచ్చే వందలాది మందికి ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఈ స్థలం కబ్జాలకు గురికాకుండా రక్షించేందుకు మనోహర్ అన్న తీసుకున్న చర్యలు అభినందనీయం. ప్రహరీ గోడ నిర్మాణం కోసం తొలి విడతగా రూ.25 లక్షలు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టడం ప్రజలందరికీ గర్వకారణం.
అయితే మనోహర్ రెడ్డి. చర్యలు వాటికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజా ఆస్తుల సంరక్షణకు కట్టుబడి ఉన్నారని గర్వంగా చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా, తాండూరు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కాగ్నా నుంచి నీటి తరలింపు ప్రాజెక్టుకు రూ.18 కోట్ల నిధులు మంజూరై వేగంగా పనులు కొనసాగుతున్నాయి.
భవిష్యత్తులో తాండూరు పట్టణానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతుల కోసం కృషి చేస్తున్న నాయకుడు కూడా మన మనోహర్ రెడ్డి.
ఇదే కాకుండా, గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన కోటిపల్లి, జుంటుపల్లి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం నడుం బిగించి, సుమారు రూ.100 కోట్లతో కోటిపల్లి ప్రాజెక్టు కాలువల మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేసిన ఘనత కూడా మనోహర్ రెడ్డి కె చెందుతుంది. దీని ద్వారా ఆయకట్టు విస్తీర్ణాన్ని సుమారు 10,000 ఎకరాలకు పెంచి రైతులకు మేలు చేసిన నాయకుడిగా నిలిచారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి . నిన్ను చూసి తాండూరు ప్రజలు గర్విస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి అభివృద్ధి దృక్పథం కలిగిన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న ప్రజల ఆకాంక్ష నేడు నెరవేరింది.
హ్యాట్సాఫ్ టు యూ. జనం మెచ్చిన నాయకుడు మనోహర్ రెడ్డి.
కే. గోపాల్ న్యాయవాది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, వికారాబాద్ జిల్లా.
