🔴 చదువుతోనే మంచి భవిష్యత్తు
🟣 10వ తరగతి విద్యార్థిని అభినందించిన ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరణ్ కోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో2025- 2026 విద్యా సంవత్సరంలో జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో సిహెచ్ యాదమ్మ అనే విద్యార్థిని 564 మార్కులు సాధించింది. దీంతో ఐ ఫౌండేషన్ రవీందర్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత విద్యార్థిని సన్మానించి ప్రత్యేక జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించి ప్రైవేటు పాఠశాలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని యాదమ్మ అందరికీ ఆదర్శం అన్నారు. ఇదే విధంగా ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు.
తాండూర్ నియోజకవర్గ స్థాయిలోనే ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఇంతటి ఉత్తమ ఫలితాలు సొంతం చేసుకోవడం గర్వకారణం అన్నారు. దీంట్లో విద్యార్థి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల పాత్ర కీలకమైంది అన్నారు.
ఈ సందర్బంగా పాఠశాల hm హేమలత, పాఠశాల ఉపాధ్యాయ బృందం పవన్, శివానాగిని, షహీన్ బేగం, శ్రీనివాస్, ప్రసాద్,రవి తదితరులు యాదమ్మను అభినందించారు.
