🔴 తాండూరులో దొంగల హల్చల్.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూరులో దొంగల హల్చల్..
నేడు ఉదయం పట్టపగలు 6:15 గంటలకు తాండూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగం కోసం ఆర్టీసీ బస్టాండుకు వెళ్తుండగా ఉదయం ఆదర్శనగర్ మైసమ్మ గుడి ఎదురుగా ఆ మహిళ మెడలో నుంచి ముగ్గురు దొంగలు పుస్తెలతాడు లాగే ప్రయత్నం చేయడంతో ఆ మహిళ కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. తస్మాత్ జాగ్రత్త.. ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. అలాగే తాండూరు పట్టణంలో ఇంకా రెండు చోట్ల చోరీ జరిగినట్టు సమాచారం. పోలీసులు జర దొంగలపై ఓ నిఘా పెట్టండి అని ప్రజలు కోరుతున్నారు.
