వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటా.

వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటా

 ఓడినా వార్డు అభివృద్ధికి పాటుపడతా కాంగ్రెస్ నాయకురాలు శిల్పా రాజేందర్

నిజ స్వరం తాండూర్ :: ప్రతినిధి :: (ఫిబ్రవరి,22)

తాండూరు పట్టణంలోని 32వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ నాయకురాలు శిల్పా రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన ఓప్రకటనలో మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడినా ప్రజల మనస్సుల్లో గెలిచానని అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డులో నిధులు తీసుకోచ్చేలా కృషి చేస్తానని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని అన్నారు. శిల్పా పటేల్ భర్త రాజేందర్ పటేల్ మాట్లాడుతూ తాము ఓడిన ప్రత్యక్ష రాజకీయంలో ఉంటామని ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.