7వ వార్డు అభ్యర్థి ఇర్షాద్ పై దాడి.

7వ వార్డు అభ్యర్థి ఇర్షాద్ పై శుక్రవారం రాత్రి 10 గంటలకు దాడి.

నిజస్వరం తాండూర్ :: ప్రతినిధి  ::

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మొన్నా ఎన్నికల్లో నూతనంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 7వ వార్డు అభ్యర్థి ఇర్షాద్ పై శుక్రవారం రాత్రి 10 గంటలకు దాడి జరిగింది. ఈ దాడిలో గాయపడ్డ ఆయనను స్థానికులు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయన పక్క టేముకలకు తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు హైదరాబాద్ కు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు అంబులెన్సులో తరలించారు. అయితే పోలీసుల ముందు వాంగ్మూలంలో తనను చంపడానికి ప్రయత్నించిన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు బంధువులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే అరెస్టు చేయాలని బంధువులు డిమాండు చేశారు.