వికారాబాద్ జిల్లా…
-
స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు..!
-
ఆశ్రమంలో 25 గంజాయి మొక్కలు స్వాధీనం
వికారాబాద్ జిల్లా: యాలాల మండలం
లోని గోవిందరావుపేట శివారులో ఉన్న ఓ స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్, యాలాల పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ సీఐ ఆన్వర్ పాషా బృందం ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో 25 గంజాయి మొక్కలు మరియు ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
