వికారాబాద్ జిల్లా | ద్దేముల్ మండలం
మారేపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – ఐదుగురు పట్టివేత
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పెద్దేముల్ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఐదుగురు వ్యక్తులు అక్కడి నుండి పరారయ్యారు.
పట్టుబడిన వారి వద్ద నుండి రూ.6,120/- నగదు మరియు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.
ప్రజలు ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
