బ్రేకింగ్ న్యూస్
వికారాబాద్ జిల్లా
కుటుంబ కలహాలతో తల్లి, కూతురు బావిలో దూకి ఆత్మహత్య
యాలాల మండలం సంఘం గ్రామానికి చెందిన సుధాకర్ కుటుంబం ఉపాధి కోసం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి గ్రామ పరిధికి వలస వెళ్లి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తోంది.
నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన వసంత కొత్తపల్లిలో పని చేస్తున్న వ్యవసాయ బావిలో తన ఇద్దరు పిల్లలతో కలిసి దూకింది.
ఈ ఘటనలో కుమారుడు బావిలో ఉన్న చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే వసంత, ఆమె కుమార్తె నవ్య బావిలో మునిగి మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది
