వికారాబాద్ జిల్లా ….
తాండూరు బైపాస్‌లో చెత్తపాలైన ప్రభుత్వ విద్యార్థుల యూనిఫామ్‌లు
వికారాబాద్ జిల్లా తాండూరు బైపాస్ రోడ్డుకు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లు చెత్తలా పారవేయబడి కనిపించాయి. రెండు సంచుల్లో పెద్ద మొత్తంలో నీలి రంగు చెక్స్ షర్టులు, నేవీ బ్లూ ప్యాంట్లు, ఇతర యూనిఫామ్‌లు ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ యూనిఫామ్‌లు అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు పారవేశారు? ఏ పాఠశాలకు చెందినవి? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దుస్తులను ఎవరు పారవేశారనే విషయంపై అధికారిక నిర్ధారణ లేదు.
