వికారాబాద్ జిల్లా | తాండూరు
రోడ్డు సరిగా కనిపించక ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న వ్యక్తి
రోడ్డు సరిగా కనిపించక ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న వ్యక్తి
తాండూరు పట్టణంలోని 28వ వార్డు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రోడ్డు సరిగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదం.
తాండూరు పట్టణానికి చెందిన కుంచం మురళి వాహనంతో వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొని తీవ్ర గాయాలు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితుడిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
