అభివృద్ధి పై ఆలోచించే వ్యక్తి ఎమ్మెల్యే.

🔴 ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలు.

🔴 ఎల్లప్పుడు తాండూరు అభివృద్ధిపై ఆలోచించే వ్యక్తి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

నిజస్వరం  తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ప్రధాన లక్ష్యం అని తెలిపారు.

ఏ ప్రాంతమైనా మెరుగైన రహదారులతోనే అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందని దృఢ నమ్మకంతో, వ్యాపార వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన తాండూర్ ప్రాంతం భవిష్యత్తులో విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని, యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కలగాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. కృషి చేస్తున్నారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి సంవత్సరం నుంచే తాండూర్ నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సంబంధిత మంత్రులకు వినతిపత్రాలు సమర్పిస్తూ,ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కూడా తాండూర్ రోడ్ల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , సంబంధిత మంత్రులు మరియు అధికారుల దృష్టికి సమస్యలను ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నారు .

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు..

గతంతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ,నిర్మాణ సమయంలో ఆర్&బీ,విద్యుత్ శాఖ,మిషన్ భగీరథ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ లోకంలో కొన్ని ప్రాంతాలలో నిధులు వృధా అవుతున్నాయని,సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఉంటే నాణ్యమైన రహదారుల నిర్మాణం జరుగుతుందని,అలాగే ప్రభుత్వ నిధులు వృధా కాకుండా ఆస్కారం ఉండదని సభ దృష్టికి తీసుకెళ్లారు.

అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రధాన రహదారులు తాండూర్ కోట్‌పల్లి ప్రధాన రహదారి. తాండూర్ తట్టేపల్లి, తొర్మమామిడి రహదారి. మరేపల్లి మదనంతపూర్ రహదారి  బుద్దారం నాగులపల్లి రహదారి  లక్ష్మీనారాయణపూర్ దేవనూర్ రహదారి. ముఖ్యంగా కోకట్ బ్రిడ్జి సమస్య. అనంతరం ఆర్&బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ, తాండూర్ నియోజకవర్గంలోని రహదారి నిర్మాణాలు మంజూవ్వడంతో పాటు సంబంధిత పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వచ్చే నెలలో పనులు కూడా ప్రారంభమవుతాయని సభలో హామీ ఇచ్చారు.

తాండూర్ అభివృద్ధి దిశగా రోడ్ల పురోగతి అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని తాండూర్ నియోజకవర్గ ప్రజలు  హర్షం వ్యక్తం చేస్తున్నారు.