ఐబి భవనంలోకి రిజిస్ట్రేషన్ కార్యాలయం.

🔴 త్వరలో నూతన ఐబి భవనంలోకి రిజిస్ట్రేషన్ కార్యాలయం.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

తాండూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం త్వరలో నూతనంగా నిర్మిస్తున్న ఇన్స్పెక్షన్ బంగ్లా (ఐబి) భవనంలోకి మారుతున్నట్లు సమాచారం. ఎన్నో ఏళ్ల నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయం పాత తాండూర్ రోడ్డులోని ప్రైవేట్ భవనంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్న ప్రభుత్వ సంస్థ కార్యాలయాలను ఇకనుంచి తమ కార్యకలాపాలను ప్రభుత్వ భవనాల్లోనే నిర్వహించాలని ఆదేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తాండూర్ పట్టణం సాయిపూర్ లో కొనసాగుతున్న ఎక్సైజ్ శాఖ కార్యాలయం పట్టణంలోని శాంతినగర్ లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలోకి మారింది.

అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ కార్యాలయం రైల్వే స్టేషన్ సమీపాన పాత తాండూర్ రోడ్డులోనీ ఓ ప్రైవేటు భవనంలో అద్దెను చెల్లిస్తూ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను నిర్వహిస్తూ వచ్చారు. ప్రభుత్వం ఆదేశంతో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ కార్యాలయం ఈనెల 28 నుంచి పట్టణంలోని ఇన్స్పెక్షన్ బంగ్లా లోకి మారనున్నట్లు అధికారుల నుంచి సమాచారం.