మొండి బకాయిలకు తలం.

🔴 మొండి బకాయిలకు తలం.

నిజస్వరం  తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను మొండిబకాయలు ఉన్న రెడ్ నోటీసు జారీ చేయడంతో పాటు తాళాలు వేయడం జరిగింది.

గత కొన్ని సంవత్సరాలుగా మొండి బకాయిలు ఉన్నా బటాయిదారులపై సోమవారం ఉదయం  కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ టీం, బిల్ కలెక్టర్లు మరియు జవాన్లు మొండిబకాయల షాపులకు వెళ్లి తాళాలు వేయడం జరిగింది.

పోట్లీ మహారాజ్ దేవాలయానికి సంబంధించి షాపులలో సీజ్ చేయడం జరిగింది.పలు దుకాణాలు ప్రైవేటు ప్రాపర్టీలకు సంబంధించి మొండి బకాయిల ధరలకు రెడ్ నోటీసులు అందిస్తూ కట్టకపోతే చట్ట ప్రకారం చర్యలు గైకొనుబడుతాయని కమిషనర్ హెచ్చరించడం జరిగింది.

టాక్సులు చెల్లించకపోతే మున్సిపాలిటీ గ్రాండ్లు నిలిచిపోయే అవకాశం ఉందని వివరించారు. పట్టణ ప్రజలు టాక్స్ లు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరడం జరిగింది.

 తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. మేనేజర్  నరేందర్ రెడ్డి, ఆర్ ఐ రాములు, బిల్ కలెక్టర్ నాగేందర్, కపిల్, వాడా ఆఫీసర్ గోపాల్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్,జవాన్లుతదితరులు ఉన్నారు.