🔴 రోడ్లను ఆక్రమించి కూరగాయలు విక్రయించొద్దు.
కమిషనర్, చైర్పర్సన్ తనిఖీలు.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
పాత మున్సిపల్ కార్యాలయం ముందు కూరగాయల వ్యాపారులు రోడ్డుపైకి రావద్దని మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, తెలిపారు.
ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేసి కూరగాయ వ్యాపారులతో మాట్లాడారు. రోడ్లపైకి వచ్చి పెట్టడం వల్ల అంబులెన్స్ కానీ, ద్విచక్ర వాహనదారుల గాని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు వివరించారు.
రేపటి నుంచి రోడ్లపై పెట్టొద్దని పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూరగాయలు అమ్ముకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని రోడ్డుపైకి వచ్చి అమ్ముకోవడంతో ట్రాఫిక్ సమస్య వస్తుందన విషయాన్ని గమనించాలని వారు వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, సాయి. జవాన్ రమేష్ సుభాష్, కూరగాయల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
