పట్నం మహేందర్ రెడ్డి తో దగ్గుబాటి మాటామంతీ.
ఏకలవ్య ఫౌండేషన్ లో అదనపు తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖులతో మహేందర్ రెడ్డి.
పురంధేశ్వరి ని పలుకరించిన మహేందర్ రెడ్డి.
నిజస్వరం తాండూర్ :: ప్రతినిధి ::
మాజీ మంత్రి శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, సీనియర్ మాజీ తెలుగుదేశం పార్టీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు లు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు.
తాండూర్ మండలం జునుగుర్తి గ్రామంలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కొత్త ఇతరులతో సాగిన కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, సీనియర్ బీజేపీ నేత పురందరేశ్వరీలు పరస్పరం కలుసుకున్నారు.
కార్యక్రమంలో బాగున్నారా అంటూ మహేందర్రెడ్డి దగ్గుపాటి వెంకటేశ్వర్లు పరస్పరం పలకరించారు. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి అంటూ దగ్గుబాటి ఆప్యాయంగా మహేందర్రెడ్డి తో కుశల ప్రశ్నలు వేశారు. తమకు మంచి అనుబంధం ఉందని పక్కనే ఉన్న కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కు, సీనియర్ నేతలకు మహేందర్ రెడ్డిని పరిచయం చేశారు. ఇదే సందర్భంలో మహేందర్ రెడ్డి సైతం వెంకటేశ్వర్ రావు తో తనకున్న సాహిత్యం నేపథ్యంలో మాట్లాడుకుంటూ పక్కనే ఉన్న దగ్గుపాటి పురందరి శరిని బాగున్నారా అమ్మ అంటూ పలకరించారు.
పురందేశ్వరి సైతం మహేందర్ రెడ్డిని పలకరించింది. యోగక్షేమాలు తెలుసుకుంది. గతంలో అంత టిడిపిలో పనిచేసిన నేపథ్యంలో స్థానిక నాయకులు సైతం వారి మాట ముచ్చటను ఆసక్తిగా విన్నారు.
