🔴 దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్ బంగారు ఆభరణాల స్వాధీనం.
నిజస్వరం తాండూర్ ప్రతినిధినిజ ::
తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాల్మీకి నగర్‌లో రెండు రోజుల క్రితం దొంగతనం సంఘటన చోటుచేసుకుంది. సుమారు 50 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, అదే ఇంట్లో పనిచేసే పనిమనిషి భర్త అయిన ముగ్లప్ప మరియు అతని స్నేహితుడు సంజీవ్ కలిసి ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి ఇంటి వద్దకు వచ్చారు.
వారి ఇంటి తలుపు కొట్టగా, బాధితురాలు తలుపు తీయగానే నిందితులు వెంటనే ఆమెపై దాడి చేసి, ఆమెను కింద పడేసి, ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు మరియు నల్లపూసల దండను బలవంతంగా తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయమై బాధితురాలు తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది.
దర్యాప్తులో భాగంగా ఈరోజు నిందితుల్లో ఒకరైన సంజీవ్‌ను శివాజీ చౌక్ ఉదయం అందాజ 10 గంటలకు పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి నేరానికి సంబంధించిన బంగారు ఆభరణాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడు సంజీవ్‌ను అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా, అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించబడింది.
ఈ కేసులో మరో నిందితుడైన ముగ్లప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
