లాడ్జ్‌లో వ్యక్తి మృతదేహం కలకలం

లాడ్జ్‌లో వ్యక్తి మృతదేహం కలకలం

వికారాబాద్ జిల్లా, తాండూర్: తాండూర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న నక్షత్ర లాడ్జ్‌లో వ్యక్తి మృతిచెందిన ఘటన కలకలం రేపింది.

మృతుడిని తాండూర్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన **దశరథ్ రెడ్డి (50)**గా గుర్తించారు. సమాచారం ప్రకారం.. దశరథ్ రెడ్డి ఐదు రోజుల క్రితం లాడ్జ్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు.

అయితే నిన్న సాయంత్రం నుంచి గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జ్ సిబ్బంది తలుపు తెరిచి చూడగా.. మంచంపై దశరథ్ రెడ్డి మృతిచెంది కనిపించారు. వెంటనే లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.