వికారాబాద్ జిల్లా…
తాగునీటి కోసం రోడ్డెక్కిన కందనెల్లి తండా ప్రజలు
పెద్దేముల్ మండలం కందనెల్లి తండాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. గత పది రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తాండూర్–కోటిపల్లి–సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.

తాగునీటి సమస్యపై గ్రామపంచాయతీ సర్పంచ్, కార్యదర్శికి పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. నీటి సరఫరా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే రావాలంటూ నినాదాలు, నిరసనతో ప్రధాన రహదారిపై కొంతసేపు రాకపోకలు స్తంభించాయి.
అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించి, గ్రామానికి సక్రమంగా నీటి సరఫరా అందించాలని కందనెల్లి తండా ప్రజలు డిమాండ్ చేశారు.
