8వ వార్డులో 25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం.

🔴 8వ వార్డులో 25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం.

నిజస్వరం తాండూరు ప్రతినిధి ::

తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో 25 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతోంది. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సహకారంతో ఈ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

ఈ సీసీ రోడ్డును నాలుగు వీధుల్లో నిర్మించడం జరుగుతుండగా, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కమిషనర్, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.