రాఖీ కట్టి సోదర భావాన్ని చాటుకున్న బీఆర్‌ఎస్ మహిళా కన్వీనర్

వికారాబాద్ జిల్లా,

రాఖీ కట్టి సోదర భావాన్ని చాటుకున్న బీఆర్‌ఎస్ మహిళా కన్వీనర్ శకుంతల

తాండూర్: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తాండూర్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతల రాఖీ కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లోని పైలెట్ రోహిత్ రెడ్డి నివాసానికి వెళ్లిన శకుంతల ఆయనకు రాఖీ కట్టి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ ప్రాధాన్యతను గుర్తుచేసుకున్నారు.

సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, పరస్పర గౌరవాన్ని మరింత బలపరిచే పవిత్రమైన పండుగ రాఖీ పౌర్ణమి అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబ బంధాలు ఎంతో విలువైనవని, ప్రేమానురాగాలతో కూడిన సంబంధాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డికి శకుంతల రాఖీ కట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. రాఖీ పౌర్ణమి వేడుకలు ఆత్మీయ వాతావరణంలో జరిగాయి.