వికారాబాద్ జిల్లా…
రాఖీ కట్టి ఆత్మీయత చాటుకున్న కూరగాయల వ్యాపార మహిళలు
తాండూర్: తాండూర్ పట్టణంలోని పాత మున్సిపాలిటీ సమీపంలో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపార మహిళలు కాంగ్రెస్ పార్టీ 36వ వార్డు అధ్యక్షులు కల్వ రాజ వంశీకి రాఖీ కట్టి తమ ఆత్మీయత, అభిమానాన్ని చాటుకున్నారు.

చిరు వ్యాపారులు, ముఖ్యంగా మహిళల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ ఓ తమ్ముడిలా అండగా ఉంటున్న కల్వ రాజ వంశీపై తమకున్న అభిమానాన్ని మహిళలు రాఖీ పండుగ సందర్భంగా చాటుకున్నారు.
ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారం చేస్తున్న మహిళలందరూ రాజ వంశీని పాత మున్సిపాలిటీ వద్దకు ఆహ్వానించి, స్వయంగా రాఖీలు కట్టి తమ సోదరభావాన్ని వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఎప్పుడూ సానుకూలంగా విని, అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్న రాజ వంశీ సేవా భావాన్ని మహిళలు అభినందించారు.
చిరు వ్యాపారుల సమస్యలను తన సొంత సమస్యలుగా భావిస్తూ వారికి భరోసా కల్పిస్తున్న రాజ వంశీపై మహిళలు చూపిన ఆప్యాయత, రాఖీ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా రాజ వంశీ తమ అభిమానాన్ని సంపాదించుకున్నారని మహిళలు పేర్కొన్నారు.
