తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ H-82 తాండూరు డివిజన్ నూతన కమిటీ.

 

🔴 తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ H-82 తాండూరు డివిజన్ నూతన కమిటీ.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి::

వికారాబాద్ జిల్లా తాండూరు: తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ H-82 తాండూరు డివిజన్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. నూతన కమిటీకి అధ్యక్షులుగా లాలు, ఉపాధ్యక్షులుగా C. బసప్ప, ప్రధాన కార్యదర్శిగా S. క్రిష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా K. శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

అలాగే కోశాధికారిగా G. గౌరి శంకర్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా అబ్దుల్ మజీద్, హెల్త్ సెక్రటరీగా సలాం మియా, సోషల్ మీడియా కన్వీనర్‌గా M. బాలక్రిష్ణలను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. యూనియన్‌ను మరింత బలోపేతం చేస్తూ ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

నూతన కమిటీ సభ్యులకు విద్యుత్ ఉద్యోగులు, యూనియన్ నాయకులు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు.