ఇది ప్రజా పాలన ప్రజల ప్రాణంతో చెలగాటమా…. గ్రామస్తుల ఆవేదన
గ్రామానికి త్రాగునీటి సరఫరా చేయని ప్రజాప్రతినిధులు..
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని ఎల్మకన్న గ్రామంలో గత వారం నుండి త్రాగునీరు ఎద్దడి….
పక్కనే కాగ్నా నది ఉండి కూడా గ్రామానికి నీటి కొరత మిషన్ భగీరథ నీటిరు సరఫరా అయినా కూడా చాలీచాల్నంతా నీటితో ఎల్మకన్న గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
వారం రోజుల క్రితం పంపు రిపేర్ కాక పోవడంతో జ నీటి సరఫరా నిలిచిపోవడం జరిగింది..
తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి కోసం వ్యవసాయ బోరు బావులను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు.
గ్రామంలో మూడు పశువుల తోటిలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో చుక్కనీరు లేదు పశువులు మూగజీవాలు విలవిల ఆడుతున్నాయి. కొన్నిచోట్ల మినీ వాటర్ ట్యాంక్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాటినీ శుభ్రత చేయడంలో నిర్లక్ష్యం….
గ్రామంలో ప్రజాపరిధిలు ఉన్నారా…. లేదా…అని స్థానికులు ఆందోళన ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ మరియు అధికారులు స్పందించి నీటిని సరఫరా చేయాలి , లేకుంటే మండల కేంద్రంలో బిందెలతో నిరసన వ్యక్తం చేస్తామని గ్రామస్తులు మహిళలు హెచ్చరిస్తున్నారు.
