నూతన చైర్మన్ ను కలిసిన న్యాయవాది గోపాల్.

నిజస్వరం తాండూర్ :: ప్రతినిధి  :                                        వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైన తాండూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నీరజ బాల్ రెడ్డి ని సీనియర్ న్యాయవాది కె గోపాల్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా మరియు బొకేతో అభినందనలు తెలియజేయడం జరిగింది. వచ్చే ఐదు సంవత్సరాలలో కొత్త పాలకవర్గం ఆధ్వర్యంలో తాండూరు పట్టణం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తాను గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మరియు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చానని భవిష్యత్తులో వారితో కలిసి నడుస్తానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి ని కలిసి అభినందించడం జరిగింది.