7వ వార్డ్ కౌన్సిలర్ ని ఘన సన్మానించిన కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

7వ వార్డ్ కౌన్సిలర్ ని ఘన సన్మానించిన కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

నిజస్వరం తాండూరు  :: ప్రతినిధి ::        తాండూర్ పట్టణంలోని ఏడో వార్డు కౌన్సిలర్ ఈర్షాద్ ను తాండూర్ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఈర్షాద్ మాట్లాడుతూ కార్పెంటర్ లు పడుతున్న కష్టాలు తనకు తెలుసని తాను కూడా ఒక కార్పెంటర్ గా ఉన్నానని వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సంగమేశ్వర్, కార్యదర్శి నరేందర్ చారి, క్యాషియర్ కాలప్ప చారి, కార్యదర్శులు పాండు మేస్త్రి, వెంకట్ మేస్త్రి, ప్రభాకర్ చారి, రజాక్, రవి, సభ్యులు రాములు చారి, సత్యనారాయణ చారి, రహీం, మోయిన్, ప్రవీణ్ చారి, నారాయణ కల్లూరు, నారాయణ నవల్గా, తదితరులు పాల్గొన్నారు.