మంబాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

మంబాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

వికారాబాద్ జిల్లా: పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామ పరిసరాల్లో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మంబాపూర్ గ్రామానికి చెందిన మక్కలి సాయిలు (35) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుడు సాయిలుకు 14, 12 ఏళ్ల ఇద్దరు కుమారులు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.