వికారాబాద్ జిల్లా…
తాండూర్:
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు.
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం పారిశుద్ధ్య కార్మికులకు ఈ ఏడాదికి సంబంధించిన నిత్యావసర వస్తువులు, కన్జర్వెన్సీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్మికులకు బట్టలు, చెప్పులు, ఆయిల్, సబ్బులు, పనిముట్లు, చీపుర్లు, శానిటేషన్‌కు అవసరమైన సామగ్రితో పాటు పలు నిత్యావసర వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన ఒకరోజు సెలవును పారిశుద్ధ్య కార్మికులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ సూచించారు. అలాగే పండుగ పర్వదినాల్లో మహిళా పారిశుద్ధ్య కార్మికులపై పని భారం తగ్గించేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డికి సూచించారు.
కార్మికుల యోగక్షేమాల పట్ల చైర్పర్సన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు పారిశుద్ధ్య కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే తాండూరు మున్సిపాలిటీ లక్ష్యమని చైర్పర్సన్ పేర్కొన్నారు.
