వికారాబాద్ జిల్లా తాండూరు…
కల్తీ కోవా, కలకాన్ పట్టివేత
వికారాబాద్ జిల్లా: జహీరాబాద్ నుంచి తాండూర్‌కు తరలించి విక్రయించేందుకు తీసుకొస్తున్న కల్తీ కోవా, కలకాన్‌ను జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తనిఖీల్లో 160 కిలోల కోవా, 14 కిలోల కలకాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.34,800గా పోలీసులు తెలిపారు. జహీరాబాద్ నుంచి తాండూర్‌కు సరుకును తరలిస్తున్న రాజస్థాన్‌కు చెందిన రూపారామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సరుకును తరలిస్తున్న ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకుతో పాటు ఆటోను తాండూర్ పోలీసులకు అప్పగించారు. ఘటనపై తాండూర్ పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.
