సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

వికారాబాద్ జిల్లా తాండూర్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

తాండూరు: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ఆయన చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గౌడ సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.