వికారాబాద్ జిల్లా తాండూర్
వార్డ్ నెంబర్ 7లో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఎన్టీఆర్ కాలనీలో సీసీ రోడ్ల పనులు ప్రారంభం
ఏడవ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్
తాండూర్: వార్డ్ నెంబర్ 7లో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని కౌన్సిలర్ ఇర్షాద్ తెలిపారు. ఇందులో భాగంగా శనివారం ఎన్టీఆర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వార్డ్ నెంబర్ 7ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కౌన్సిలర్ ఇర్షాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ కాలనీలోనే కాకుండా వార్డ్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేయించేందుకు కృషి చేస్తానన్నారు.
ప్రజల ప్రేమ, ఆశీర్వాదం ఉన్నంతకాలం వార్డ్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి పనులు ఆగవని స్పష్టం చేశారు.
“ప్రజలకు ఇచ్చిన మాటే నా బాధ్యత.. చెప్పింది చేసి చూపించడమే నా లక్ష్యం. వార్డ్ నెంబర్ 7 అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రజలతో, ప్రజల కోసం పనిచేస్తాను” అని కౌన్సిలర్ ఇర్షాద్ అన్నారు.
