బీసీ స్మశానవాటిక అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదేశాలు

వికారాబాద్ జిల్లా..

బీసీ స్మశానవాటిక అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదేశాలు

తాండూరు: పట్టణంలోని పోలీస్ స్టేషన్ ప్రధాన కూడలి వద్ద ఉన్న బీసీ స్మశానవాటికను అభివృద్ధి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్ రెడ్డి ని కోరారు. ఈ మేరకుతో తాండూరు బీజేపీ ఫ్లోర్ లీడర్, 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం, 23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ కుమార్, 33వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేకు మెమోరాండం అందజేశారు.

స్మశానవాటికలో పేరుకుపోయిన చెత్తను యుద్ధప్రాతిపదికన తొలగించడంతో పాటు ఇంటర్నల్ రోడ్లు, కాంపౌండ్ వాల్, డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీరు లోపలికి రాకుండా చర్యలు, లైటింగ్ వ్యవస్థ, ప్రధాన గేటు వద్ద షెడ్డు నిర్మించాలని వారు కోరారు.

మెమోరాండంపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వెంటనే స్పందిస్తూ, స్మశానవాటికలో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్ రెడ్డిని ఆదేశించారు. దీంతో బీసీ స్మశానవాటిక అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కౌన్సిలర్లు తెలిపారు.