మాణిక్ నగర్‌లో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్ 68 వాహనాలు, 54 మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

వికారాబాద్ జిల్లా తాండూర్

  • మాణిక్ నగర్‌లో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్

  • 68 వాహనాలు, 54 మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేరా ఆదేశాల మేరకు తాండూర్ డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని మాణిక్ నగర్ కాలనీలో శనివారం ఉదయం 4 గంటలకు పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్) తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా రౌడీషీటర్లు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు, ఇతర అనుమానితుల వివరాలను పోలీసులు పరిశీలించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 68 వాహనాలను గుర్తించారు. వీటిలో 65 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.

అలాగే 54 మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ.. గుట్కా, మద్యం ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. అక్రమంగా మద్యం, గుట్కా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తనిఖీల్లో పట్టుబడిన వాహనాలకు సరైన పత్రాలు ఉన్న వాహనదారులు సంబంధిత పత్రాలను పోలీసులకు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.