వికారాబాద్ జిల్లా | తాండూర్
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
తాండూర్ పట్టణంలో తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం మరియు ఇందిరా చౌక్ ప్రధాన కూడలిలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన సేవలను కొనియాడారు.
