వికారాబాద్ జిల్లా | యాలాల మండలం
అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం.. వ్యక్తి ప్రాణాలు కాపాడిన యాలాల పోలీసులు
యాలాల, ఆగస్టు 6: అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా, యాలాల పోలీసులు సకాలంలో స్పందించి అతని ప్రాణాలను కాపాడారు.
వివరాల్లోకి వెళ్తే, యాలాల మండలం కోకట్ గ్రామానికి చెందిన పాషా అనే వ్యక్తి అప్పుల బాధతో అర్ధరాత్రి హైదరాబాద్ మార్గంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలుకు ఎదురెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
నాకు అప్పులు బాధలు ఎక్కువ ఉన్నాయి అంటూ 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించిన పాష
సమాచారం అందుకున్న బ్లూ కోర్ట్ సిబ్బంది ప్రశాంత్ రెడ్డి, జగదీష్ వెంటనే మొబైల్ నెట్వర్క్ ద్వారా లొకేషన్ కనుక్కొని సంఘటన స్థలానికి చేరుకుని అప్రమత్తంగా వ్యవహరించి పాషాను సురక్షితంగా అదుపులోకి తీసుకుని అతని ప్రాణాలను కాపాడారు.
జీవితంపై విరక్తి చెందిన పాషా కు కౌన్సిలింగ్ ఇచ్చి గ్రామ ఉపసర్పంచ్, పెద్దలకు అప్పగించారు
ఈ ఘటనపై స్పందించిన యాలాల ఎస్సై విఠల్ రెడ్డి, అత్యవసర సమయంలో వేగంగా స్పందించి ఓ నిండు ప్రాణాన్ని రక్షించిన బ్లూ కోర్ట్ సిబ్బంది ప్రశాంత్ రెడ్డి, జగదీష్‌లను అభినందించారు. అలాగే, ఎలాంటి ఆపద పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించిన యాలాల ఎస్సై విట్టల్ రెడ్డి.
