వికారాబాద్ జిల్లా | తాండూరు
ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ అందజేత
తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి రూ.20 లక్షల విలువైన అంబులెన్స్‌ను “యునైటెడ్ వే బెంగళూరు” స్వచ్ఛంద సంస్థ అందజేసింది. అత్యవసర వైద్య సేవలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందించాలనే ఉద్దేశంతో ఈ అంబులెన్స్‌ను ఆస్పత్రికి అందించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తాండూరు పట్టణ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, యునైటెడ్ వే బెంగళూరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఎమ్మెల్యే అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంబులెన్స్‌ను ప్రారంభించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే రోగులకు పండ్లు పంపిణీ చేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి అందించిన అంబులెన్స్ అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
