🔴 ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు..
నిజ స్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఘనంగా జరుపుకుంటున్నారు.
అయితే భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన అజ్మీర్ షరీఫ్ దర్గాలో 4వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ వసీం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పూలతో చాదర్ సమర్పించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ప్రత్యేక దువా కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాండూరు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అలుపెరుగని నిరంతర ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి ని నిండు నూరేళ్లు దీవించాలని ఆ అల్లాను వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
