వికారాబాద్ జిల్లా
కాగ్నా వంతెనకు పగుళ్లు.. ఎమ్మెల్యే పరిశీలన
తాండూర్: కాగ్నా నదిపై నిర్మించిన వంతెనకు ఏర్పడిన పగుళ్లను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) పరిశీలించారు. వంతెన నిర్మాణ నాణ్యత, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల నాణ్యతపై సరైన దృష్టి పెట్టకుండా, కమిషన్లపైనే ఎక్కువ శ్రద్ధ చూపించారని ఆరోపించారు. కాగ్నా నదిపై నిర్మించిన వంతెనకు ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు పగుళ్లు ఏర్పడటం ఇందుకు నిదర్శనమని అన్నారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వంతెనకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు నిర్మాణ నాణ్యత, నాణ్యతా ప్రమాణాలపై సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
