యూత్ ఫర్ సేవా సేవలు అభినందనీయం తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కే. రవీందర్ గౌడ్

వికారాబాద్ జిల్లా…

యూత్ ఫర్ సేవా సేవలు అభినందనీయం

తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కే. రవీందర్ గౌడ్

కొడంగల్ : యూత్ ఫర్ సేవా సహకారంతో చెట్టుపల్లి తండాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) విద్యార్థినుల తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కే. రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ముందుకొచ్చిన యూత్ ఫర్ సేవా సభ్యులు సతీష్ రంగంపేట, పుండరీకాక్షతో పాటు సర్వీస్ ఫోర్స్ ప్రతినిధులు సంతోష్ రెడ్డి, జైపాల్, ఆదిల్ గౌతమ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కేజీబీవీ ఎస్‌ఓ రాధిక విజ్ఞప్తి మేరకు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న సుమారు 330 మంది విద్యార్థినుల కోసం ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 330 మంది విద్యార్థినులకు ఆంగ్ల డిక్షనరీలు, 55 మంది విద్యార్థినులకు స్టీల్ మంచినీటి బాటిళ్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థినులు పాల్గొన్నారు.