వికారాబాద్ జిల్లా…
వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన BSR దంపతులు
తాండూర్: పట్టణంలోని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) నివాసంలో వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సరళా రెడ్డి దంపతులు వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.
వరలక్ష్మి వ్రతం సందర్భంగా BSR నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
