వికారాబాద్ జిల్లా, తాండూరు:
డయల్ యువర్ డీఎం కార్యక్రమం
తాండూరు డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు శుక్రవారం “డయల్ యువర్ డీఎం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలను సెల్ నంబర్ 9063469572కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.
ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ సూచించారు.
