నాకు న్యాయం చేయండి అంటూ ఆర్డిఓ కార్యాలయానికి వెళ్లిన మోముల బాలమ్మ.

🔴 నాకు న్యాయం చేయండి అంటూ ఆర్డిఓ కార్యాలయానికి వెళ్లిన మోముల బాలమ్మ.

వికారాబాద్ జిల్లా పెద్దముల్

నిజస్వరం పెద్దేముల్ ప్రతినిధి::

మోముల బాలమ్మ భర్త మోముల రాంచెంద్రి (చెంద్రప్ప), సుమారు వయస్సు 58 సం నివాసము : ఇంటి నెం. 10-17, పెద్దెముల్ గ్రామము/మండలము, వికారాబాద్ జిల్లా,

నా భర్త మోముల’ రాంచెంద్రి (చెంద్రప్ప)తో 1975 సం మా అక్కయినటువంటి మాణెమ్మ తో వివాహం జరిగినది. ఆమె అనారోగ్యకారణం తో 1983 సం మరణించడంతో 1984 సం నేను మోముల బాలమ్మ భర్త మోముల రాంచంద్రి (చెంద్రప్ప) నా వివాహము జరిగినది. నాకు ఇప్పటివరకు ఎలాంటి సంతానము లేదు. పై తెల్పిన సర్వే నెంబర్లలో గల భూమిలో నేను నా భర్త భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాము, ప్రస్తుస్తము తేది : 12-01-2026 సం నా బర్త  మోముల రాంచెంద్రి (చెంద్రప్ప) మరణించడంతో తో సాగు చేస్తూ దీని ఆధారంగా ఇప్పటివరకు. నేను సాగుచేస్తున్న భూమిని నాకు, నా భర్తకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అయినటువంటి వేముల శ్రీనివాస్

అయినటు అను వ్యక్తి 2012 సం నోటరీలో పేరు మార్చుకొని మోముల రాంచంద్రి (చెంద్రప్ప)కు (3) ముగ్గురు బార్యాలు ఉన్నారు. అంటూ నేను మొదటి భార్యకు సంబంధించిన కుమారుడని అంటూ మోసపూరితంగా ఫ్యామిలి సర్టిఫికెట్, మండల రెవెన్యూ  అధికారులతో పొంది, నాకు ఫ్యామిలి సర్టిఫికెట్ ఇవ్వకుండ నా భర్త పేరిట భూమిని ఏలాగైన అతని పేరిట మార్చుకొనుట కొరకు అతని పేరు మార్చుకొని నా ఇంటి నెంబర్ 10-17 అతని ఇంటికి పెట్టుకొని తప్పుడు పత్రాలను సృష్టించి, అతని పేరిట భూమిని పట్టా మార్పిడి చేసుకొనుటకు తహశీల్దార్ పెద్దెముల్ మండలము, మరియు డిప్యూటి తహశీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెద్దెముల్ మండలము గార్లు కుమ్మక్కై, గ్రామములో కొందరి వ్యక్తుల సాక్షులతో మోస పూరితంగా పట్టా మార్పిడి చేసుకొనుటకు సహారించడం జరుగుతున్నది.

కనుక పై తెలిపిన (3) ముగ్గురు అధికారులపై పూర్తి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోని నాపై దయచేసి నా భర్త పేరిట కలిగిన భూమిని నా పేరిట వేరే మండల అధికారులతో విచారణ జరిపి పై తెలిపిన సర్వే నెంబర్లపై అన్ని రెవెన్యూ రికార్డులలో నమోదు చేసి నాకు న్యాయం చేయగలరని మోముల బాలమ్మ తెలిపారు.